దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం
కొనసాగుతున్న ఉరుసు ఉత్సవం
కడప సెవెన్‌రోడ్స్: యావత్ భారతావనిలో దేశభక్తిని నింపే స్ఫూర్తి మంత్రం వందేమాతర గేయమని జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి వెంకటపతి పేర్కొన్నారు. వందేమాతరం గేయ రచన చేసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో శుక్రవారం ‘వందేమాతరం’ సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి వెంకటపతితోపాటు గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉదయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవి బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో.. కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి స్ఫూర్తి నింపిందన్నారు. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రతి విద్యాలయంలో ప్రార్థన గీతంగా అలపిస్తున్నారన్నారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తికి ప్రతీక అన్నారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతా ఏకమై వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ దేశభక్తి గీతం ఉద్యోగుల్లో కూడా జాతీయత భావం, ఐక్యతను మరింత పెంపొందిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది నినదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పన అధికారి సురేష్ కుమార్, ఏఓ విజయ్ కుమార్, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ పుణ్యక్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవా లు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో మూడవ రోజు శుక్రవారం కావడంతో.. భక్తులు భారీ సంఖ్యలో దర్గాకు విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఫాతెహా నిర్వహించి దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. కిష్తి లూటీ (మహానైవేద్యం) కార్యక్రమానంతరం ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. మగ్రీబ్ నమాజ్ తర్వాత పీఠాధిపతి ఊరేగింపుగా.. తపో దీక్షలో ఉన్న మలంగ్‌షా వద్దకు వెళ్లి దీక్ష విరమింపజేశారు.
ఘనంగా అఖిల భారత ముషాయిరా
పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు సంప్రదాయ ప్రకారం ఆలిండియా 81వ ముషాయిరా (కవి సమ్మేళనం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి దర్గా గురువులు, శిష్యగణం వెళ్లి ఘనంగా స్వాగతం పలికి.. దర్గా లాంఛనంగా పేటా అలంకరించారు. అనంతరం ఆయన దర్గాలోని పీరుల్లామాలిక్ మజార్‌కు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దర్గా ఆవరణలోని ముషాయిరా హాలులో జరిగిన దర్గా గురువుల అధ్యక్షతన ప్రత్యేక అతిథి సమక్షంలో అఖిలభారత ముషాయిరా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రముఖ నాత్ ఖాన్‌లు, కవులు మహా ప్రవక్త మహమ్మద్ గుణగణాలను కొనియాడుతూ భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం గురువులు వారిని సత్కరించారు.
భక్తిశ్రద్ధలతో కిష్తిలూటీ కార్యక్రమం
మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి
రెవెన్యూ అధికారి వెంకటపతి
వందేమాతరం గేయం ఆలపిస్తున్న
అధికారులు, ఉద్యోగులు
దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం
దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం
దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం
దేశభక్తి స్ఫూర్తి మంత్రం.. వందేమాతరం


