స్పెల్ బీకి విశేష స్పందన
● పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు
● ఆంగ్లంపై ఆసక్తి పెరుగుతుందంటున్న చిన్నారులు
స్పెల్‌బీలో పాల్గొన్న జీఎంఆర్ స్కూల్ విద్యార్థులు
హైదరాబాదు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో డ్యూక్స్ వ్యాప్తి, డ్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న స్పెల్ బీ కాంపిటేషన్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూల్, జీఎంఆర్ స్కూల్, లిటిల్ ప్లానెట్ స్కూల్, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, శివశివాని, జీఆర్‌టీ జీవీకే స్కూల్, వేంపల్లి శ్రీ చైతన్యం స్కూల్, గురిజాల నేతాజీ స్కూల్‌లలో నిర్వహించిన తొలి రౌండ్ స్పెల్‌బీకి చక్కటి స్పందన లభించింది. ఈ కాంపిటీషన్‌కు పలు పాఠశా లల విద్యార్థులు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. అంగ్లంపై మక్కువ పెంచేలా, ఆసిక్తి కలిగించేలా ప్రయత్నం చేస్తున్న ‘సాక్షి’కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం 10 గంటలకు నుంచి ప్రారంభమైన ఈ పోటీ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. ఆంగ్లంపై ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటు భాషపై పట్టు సాధించేలా కాంపిటీషన్ ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. కాగా సోమ వారం నిర్వహించిన కాంపిటేషన్‌లో కేటగిరీ–1లో 1,2 తరగతులు విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–3లో 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.
స్పెల్ బీకి విశేష స్పందన
స్పెల్ బీకి విశేష స్పందన
స్పెల్ బీకి విశేష స్పందన


