శివశంకర... అభయంకర!
కడప సెవెన్‌రోడ్స్: గంగాధరుడి దర్శనం కోసం చీకటిని లెక్కచేయక భక్తులు తెల్లవారుజామునుంచి ఆలయాల వద్ద బారులు తీరారు. భోళా శంకరునికి తమ శక్తిమేరకు ఫలం, పుష్పం సమర్పించి ఆలయాల ప్రాంగణాల్లో కార్తీక దీపం వెలిగించి తన్మయులయ్యారు. కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు, అలంకారం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. మొక్కులుగల వారు ఆలయాల ప్రాంగణాలలో ఉదయం, సాయంత్రం కార్తీక దీపాలను వెలిగించా రు. కొందరు పిండి దీపాలు, మరికొందరు ఉసి రి దీపాలు, ఇతర ద్రవ్యాలతో ప్రమిదలు చేసి వెలిగించారు. మొక్కులుగల భక్తులు వెయ్యి, పది వేలు, అంతకుమించిన ఒత్తులతో అఖండ దీపాలను వెలిగించారు. భక్తులు కొందరు సమీపంలోని అటవీ ప్రాంతాలకు, మామిడి తోటలు తదితర ప్రాంతాలకు వన భోజనాలకు తరలి వెళ్లారు.
శివాలయాలకు ప్రత్యేక బస్సులు
ఈనెల 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పొలతల, నిత్యపూజ కోన, పుష్పగిరి, కన్యతీర్థం, అగస్థీశ్వరకోన శైవ క్షేత్రాలను జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్‌ఎం తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఆయా డిపోల నుంచి పోవడానికి, తిరిగి రావడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విశేష అలంకారంలో శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, స్వామి దర్శనానికి క్యూలైన్‌లో వేచివున్న భక్తులు
భక్తిశ్రద్ధలతో కార్తీక రెండవ సోమవారం
శివశంకర... అభయంకర!
శివశంకర... అభయంకర!


