నేడు బ్రహ్మంగారి జయంతి
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధ కర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 417 సప్త దశోత్తర చతుశ్యత జయంతి మహోత్సవాలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేనేజర్ ఈశ్వరా చారి తెలిపారు. సమీపంలోని పార్క్ లో ఉన్న స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం, రాత్రికి కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు.
కడప రూరల్: అల్ సోల్స్ డే సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆత్మల స్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ బిషప్ కె సామ్యూల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవ్యాప్తంగా క్రై స్తవులు మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తుల వెలిగించి ప్రార్థనల ద్వారా స్మరించుకుంటారని పేర్కొన్నారు. క్రైస్తవ కుటుంబాలు బిషప్, పాస్టర్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. ఆ మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు కొత్త రిమ్స్ వద్దు గల క్రై స్తవుల సమాధుల తోటలో మరియు 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాసాపేట లోని దొరల గోరీల వద్ద సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్ నంబరు 9573037770 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గాలేరు – నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎన్‌ఎస్‌ఎస్ (ఎల్‌ఏ) స్పెషల్ కలెక్టర్ (ఎఫ్‌ఏసీ)గా విధులు నిర్వహించిన ఎస్.నీలమయ్య రిలీవ్ అవ్వడంతో ఆ స్థానాన్ని అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరిగింది. ఆ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో జీఎన్‌ఎస్‌ఎస్ (ఎల్‌ఏ), కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పథకంలో భాగంగా అన్ని రకాల భూసేకరణ, పరిహారం, విస్తరణ సంబందిత అన్నిరకాల పరిపాలన వ్యవహారాలను సమర్థవంతంగా పెండింగ్ లేకుండా చర్యలు చేపడతామన్నారు.
రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్టమహోత్సవాల్లో భాగంగా శనివారం టీటీడీ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం భగవతుపణ్యాహం, శాంతిహోమం, మహాకుంభారాధనం, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వకమూర్తి హోమం, శాత్తుమర, తీర్థగోష్టి చేపట్టారు. సాయంత్రం మూర్తిహోమం, విష్ణుసహస్రనామ పారాయణం, జలాధివాసనము, పూర్ణాహుతి నిర్వహించారు. .
కడప సెవెన్‌రోడ్స్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి అధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శింపజేశారు. అనంతరం ఆమె స్థానిక శివాలయంలో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ కుమార్, న్యాయమూర్తులు ప్రవీణ్ కుమార్, ప్రత్యూష, ఈశ్వర్ దేవాంగలు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
కడప అర్బన్: కడప నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర హైకోర్టు జడ్డి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను శనివారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేశారు.
నేడు బ్రహ్మంగారి జయంతి
నేడు బ్రహ్మంగారి జయంతి


