పండుగ ఢూం.. ఢాం..
పిల్లల అల్లరిని సూచిస్తూ తారాజువ్వలు రివ్వుమని ఆకాశానికి ఎగిరాయి. పెద్దల ఆనందానికి ఉదాహరణగా మతాబులు, చిచ్చుబుడ్లు, వెలుగులు చిమ్మాయి. పెద్దల ఆధ్వర్యంలో పిల్లలు సంబరంగా టపాసులు కాల్చారు. తెలుగు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో.. దీపాలతో కళకళలాడాయి. కాంపౌండ్ గోడలపై దీపాల వరుసలు కనుల పండుగ చేశాయి. దీపావళి పండుగను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇళ్లు, వ్యాపార సముదాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం లక్ష్మిపూజ చేశారు. మహిళలు ఇళ్లు, ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించడంతో కాంతులు నిండాయి. దీంతో ఊరూవాడ దీప కాంతులతో వెలిగిపోయాయి. సాయంత్రం 6 గంటల నుంచే వీధులన్నీ పటాసుల ధ్వనులతో మార్మోగాయి. –కడప సెవెన్‌రోడ్స్
ఆకాశాన మబ్బు మెరిసింది.. చినుకై నేల రాలింది.. ఇలపై ఇలా పూల సోయగం కనువిందు చేసింది. మంగళవారం కురిసిన వాన జల్లులకు వైవీయూలోని బొటానికల్ గార్డెన్ కొత్త అందాలు సంతరించుకుంది. మొక్కలపై నీటి బిందువులు ముత్యాల్లా దర్శనమిచ్చాయి. పొగమంచు అందాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేశాయి. – ఫొటోగ్రాఫర్, సాక్షి ,కడప
ప్రకృతి అందం
ప్రకృతి అందం
ప్రకృతి అందం


