
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు.
తీగలు తగిలి గేదెలు..
వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్‌రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. విద్యుత్ తీగలు తగులుకుని మృతి చెందిన గేదెల విలువు సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలని బాధిత రైతు నాగేశ్వరరెడ్డి కోరారు.

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి