
ఆర్‌డీఎస్‌ఎస్‌తో 24 గంటల విద్యుత్ సరఫరా
మైదుకూరు : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీఎస్‌ఎస్ (రివేంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)తో 24 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద జరుగుతున్న ఆర్డీఎస్‌ఎస్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆర్డీఎస్‌ఎస్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాయప్పగారిపల్లెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల, గ్రామీణాభివృద్ధి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏపీఎస్పీడీసీఎల్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
దువ్వూరు : పీఎం–కుసుం ఫీడర్ సోలార్ విద్యుద్దీకరణ పనులనుఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ శుక్రవారం పరిశీలించారు. దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఐదు మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన స్థల సేకరణ, మట్టి పరీక్ష అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణ, ఈఈలు లక్ష్మీపతి, నాగరాజు, డీఈఈలు శ్రీకాంత్, శివభాస్కర్, ఏఈలు రాజ్‌కుమార్, రామభద్రయ్య, హరి పాల్గొన్నారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్