
అసంవాద బ్యాంకు ఖాతాలను నిర్వహణలోకి తీసుకురావాలి
కడప సెవెన్‌రోడ్స్ : భారత ప్రభుత్వం అసంవాదనీయ(అన్ క్లెయిమ్డ్) బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, బీమా, పొదుపు పథకాల నిధులు నిజమైన హక్కుదారులకు చేరేలా బ్యాంకర్లు చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో నిరుపయోగంగా ఉన్న అసంవాద (అన్ క్లెయిమ్డ్) అకౌంట్లను తిరిగి నిర్వహణలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో చేపట్టిన అవగాహన కార్యక్రమ బ్రోచర్లను కలెక్టర్ శుక్రవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచారం ప్రారంభించి.. ఆ అకౌంట్లను యాక్టివేట్ చేసేలా బ్యాంకర్లు చురుకై నపాత్ర పోషించాలన్నారు. బ్యాంకు కంట్రోలర్లు, సమన్వయకర్తలు తమ శాఖలను చైతన్యపరచి, బధిర ఖాతాదారులకు లేఖలు/ ఎస్‌ఎంఎస్‌లు పంపించాలని సూచించారు. అన్ని బ్యాంకులు ఆయా శాఖలలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి నిజమైన హక్కుదారులకు తిరిగి చెల్లించాలన్నారు. బ్యాంకులు తమ కస్టమర్లు, లేదా డిపాజిటర్లను ప్రోత్సహించి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్(డీఈఏ)ఫండ్‌లో ఉన్న అసంవాదనీయ డిపాజిట్లను నిజమైన హక్కుదారులకు ఇవ్వడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దనం, సీపీవో హజరతయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి