
సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపిక
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపికై నట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోణం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సివిల్ పర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కోణం ఫౌండేషన్, గేట్ ప్రవేశ పరీక్షలకు హైదరాబాద్ ఎఎస్ ఇంజినీరింగ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తున్నారన్నారు. గత నెలలో డా.డి.కోనప్ప ఇందుకోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ పరీక్షలలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి యూపీఎస్‌సీ శిక్షణకు తొమ్మిది మంది, గేట్ శిక్షణకు 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరికి కోణం స్వచ్ఛంద సంస్థ ఉచిత శిక్షణ, ఫెలోషిప్ అందిస్తుందని, గేట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎఎస్ ఇంజినీరింగ్ సంస్థ ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంకులు సాధించాలని కోరారు. ఇందుకోసం ట్రిపుల్ ఐటీలో ఒక తరగతి గది ఏర్పాటుచేసి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని డీన్ ఆఫ్ అకడమిక్ రమేష్ కై లాష్ తెలిపారు.