
పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు
ప్రొద్దుటూరు : స్థానిక మైదుకూరు రోడ్డులోని అమూల్య ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంభం వెంకటేశ్వర్లు (ప్రొద్దుటూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేని రాంబాబు (జగ్గయ్యపేట), రాష్ట్ర కోశాఽధికారిగా పొదిలి సూర్య చిరంజీవి (జంగారెడ్డి గూడెం), మహిళా అధ్యక్షురాలుగా జడిమేని కనకదుర్గమ్మ (గుడివాడ), ఉపాధ్యక్షులుగా పసుపులేటి మనోజ్ కుమార్ (కడప), పసుపులేటి విజయకుమారి (మాజీ డైరెక్టర్) (కడప), చేనికుమారి (మాజీ డైరెక్టర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు నాయుని పెద్దన్న, గోవిందరాజులు, నాగరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ డైరెక్టర్ తుపాకుల వెంకటరమణ, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, పొదిలి రాము, బత్తిని పెద్ద స్వామి తదితరులు పాల్గొన్నారు.