
పుష్పగిరి ఆలయాలకు రూ.13,41,000 ఆదాయం
వల్లూరు : ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఒక సంవత్సర కాలానికి తలనీలాల సేకరణకు, టెంకాయల విక్రయ హక్కుకు కొండపైన గల ఆలయంలో దేవదాయ శాఖ అధికారులు బుధవారం వేలం పాట నిర్వహించారు. మొత్తం రూ. 13, 41, 000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం ఇండియన్ బ్యాంకు కడప బ్రాంచ్‌లో జమ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప డివిజినల్ అధికారి శివయ్య, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఐజీ గార్ల్‌ను సందర్శించిన జర్మన్ అంబాసిడర్
పులివెందుల : పులివెందులలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ – లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐజీ గార్ల్)ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ బుధవారం సందర్శించారు. ఆయన వెంట బెంగళూరు కాన్సుల్ జనరల్ అమిత దేశాయ్, కేఎఫ్‌డబ్ల్యూబీ నాచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు అకాడమీలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్కడ చేపడుతున్న జాతీయ, అంతర్జాతీయస్థాయి అధ్యయనాలు, అకాడమీ ద్వారా సాధిస్తున్న ఫలితాలను పరిశీలించారు. అలాగే ఫార్మర్ సైంటిస్ట్, మెంటార్ కోర్సులను అభ్యసిస్తున్న రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, యంగ్ రీసెర్చ్ ఫెలోస్, ఇంటర్న్‌లతో మాట్లాడారు. అనంతరం ఐజీ గార్ల్‌లో ప్రకృతి వ్యవసాయ చక్రం ద్వారా సాగు పద్ధతులు, రైతు సాధికార సంస్థ వారిచే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాల వాడకంవల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోను ఢీ కొన్న లారీ
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆటోలోని యువకుడి కాళ్లకు తీవ్ర గాయమైంది. పోలీసుల వివరాల మేరకు.. రాజంపేట నుంచి కడపకు వెళుతున్న అరటికాయల ఆటోను కొత్తమాధవరం బస్టాండు సమీపానికి రాగానే కడప నుంచి రాజంపేట వైపు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ ఢీ కొంది. దీంతో ఆటోలోని కడపకు చెందిన శివశంకర్(22) కాళ్లకు తీవ్ర గాయమైంది. గాయపడిన యువకుడిని కడప రిమ్స్‌కు తరలించారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి (50)మృతి చెందాడు. ఆస్పత్రి అధికారి వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం గాలివీడు ప్రాంతం నుంచి 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న అతనికి చికిత్స చేసినప్పటికి పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన రోజు తన పేరు చంద్రయ్య అని, ఊరు తిరుపతి అని చెప్పాడు.
ఇంటి జాగా కోసం
అన్నదమ్ముల ఘర్షణ
ములకలచెరువు : ఇంటిజాగా విషయంపై అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు... మండలంలోని సోంపల్లెకు చెందిన అన్నదమ్ములు ఖాదర్‌వలీ, నజీర్‌లు ఇంటిజాగా విష యంపై గొడవపడ్డారు. ఈ గొడవలో ఖాదర్‌వలీ తలపై నజీర్ ఇనుపరాడ్డుతో కొట్టాడు. నజీర్ బంధువులు బీబీ, హుస్సేన్, ఫకృద్దీన్ కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : లైసెన్సుదారులు తమ మద్యం దుకాణాలలో రీటైల్ పోర్టల్ ద్వారా స్కాన్ అయిన మద్యం సీసాలను మాత్రమే అమ్మాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. రాయచోటి పట్టణంలో బుధవారం పలు మద్యం షాపుల యజమానులకు, నౌకరనామదారులకు ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన మద్యం బాటిళ్లను అమ్మే ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించి సూచనలు