
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని కదిరి రోడ్డులో వెంకటాపురం కాలనీ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వెంకటాపురం నుంచి పులివెందులకు వస్తున్న జోగన్న అనే వృద్ధుడు ద్విచక్ర వాహనాన్ని పులివెందుల నుంచి కదిరి రోడ్డు వైపు వెళ్తున్న మరొక ద్విచక్రవాహం ఢీకొంది. ఈ ప్రమాదంలో జోగన్నతోపాటు మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రిమ్స్ మార్చురీలో
గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌ను గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిధిలోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన రైల్వే లైన్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి అందులోని మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. భారతి, జువారి, చిలంకూరు ఐసీఎల్, ఎర్రగుంట్ల ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన ప్రతినిధులు డీఆర్‌ఎంను కలిశారు. అంతకు ముందు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తాకు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ మేనేజర్, ఆర్‌పీఎఫ్ సీఐ, గుంతకల్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, సిబ్బంది స్వాగతం పలికారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు