
రైతుల భూములకు రీసర్వే నిర్వహించాలి
తొండూరు : మండల పరిధిలో ఉన్న రైతుల భూములకు సంబంధించి ఫేజ్–3 రీసర్వేను రైతుల సమక్షంలో నిర్వహించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్’ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల డివిజన్ గుండ్లమడుగు పంచాయతీ పరిధిలోని ఫేజ్–3 కింద జరిగే ఫ్రీ హోల్డ్ భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములను రీసర్వే నిర్వహించేటప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు పర్యాయాలు తెలియజేసి, వారిని పిలిపించి అప్పటికి అందుబాటులోకి లేకపోతే వీడియో కాల్ ద్వారా భూ రీసర్వే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మురళీ కుమార్, డిప్యూటీ సర్వేయర్లు హేమలత, రియాజుద్దీన్, తొండూరు సర్వేయర్ రాఘవేంద్ర, లింగాల, పులివెందుల, వేంపల్లె సర్వేయర్లు పాల్గొన్నారు.