
కూటమి ప్రభుత్వ వైఖరి దుర్మార్గం
జిల్లాలో ఉల్లి పంట పండించిన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గం. ఉల్లిని క్వింటాల్ 1200 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చేతులెత్తేసింది. దీంతో రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీ లు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే హెక్టారుకు 50,000 రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు ఉల్లి రైతులకు కొంత వరకై నా తమ నష్టాలు తగ్గుతాయని భావించాం. కానీ వైయస్సార్ జిల్లాలో పండించిన ఉల్లి పంట వైరెటీ రకం అనే సాకుతో పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పడం దారుణం. – పోతిరెడి బాస్కర్, రైతు సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి(సీపీఐ రైతు విభాగం)