
మాటలకే పరిమితం...
ఉల్లి రైతుల కష్టాలను రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నా, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కనికరం చూపిన దాఖలాలు లేవు. వాస్తవంగా కర్నూలులో ఉల్లి రైతుల సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం రూ.1200 కనీస మద్దతు ధర ఇస్తామని, ఆ తర్వాత హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని మాటలు చెప్పింది. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సైతం క్వింటాల్ రూ.12వందలతో కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరించకున్నుట్లు ప్రకటించారు. మాటలకు పరిమితం మినహా ఆచరణలో చూపెట్టకపోయా రు. కర్నూలులో ఇచ్చిన హామీ మేరకు రైతుల ఎన్‌రోల్‌మెంట్ కూడా చేపట్టలేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడంతో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రెండు నెలలుగా రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నా ఇప్పటికీ కూటమి నేతలు ఉల్లి రైతుల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయడం, లేదా మద్దతు ధర అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించడం కానీ చేయడం లేదు.