
మొదటి నుంచి వివక్షే ...
కూటమి ప్రభుత్వానికి రైతులంటే మొదటి నుంచి వివక్షే. రైతుల సమస్యలను ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాలకు దెబ్బతిన్న ఉల్లి రైతులకు కర్నూల్ జిల్లాకు హెక్టారుకు రూ. 50 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాని పక్కనే ఉన్న వైఎస్సార్‌జిల్లా రైతులను విస్మరించారు. దీనిని వివక్షకాక మరేమంటారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి.
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ
రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు