
సిట్‌తో సరిపెట్టేస్తారా?
ప్లాంట్ ఏర్పాటులో వీరి పాత్ర
కొనసాగుతున్న గాలింపు
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై, అందులో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలపై సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని వైఎఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సరి పెట్టేసింది. ఈ దర్యాప్తు రైట్ అవుతుందా లేదా అన్నది మున్ముందు చూడాలి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీపై సిట్ దర్యాప్తు చేస్తుందని సీఎం చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. ఇప్పటిదాకా ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు. రిమాండ్ రిపోర్టులను కూడా నివేదించారు. ప్రధానంగా టీడీపీ నేతల ప్రమేయంపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో సురేంద్ర నాయుడు పై తొలుత కేసు నమోదు చేయగా, తర్వాత అరెస్టు అయిన వారి వాంగ్మూలం ఆధారంగా జయచంద్రారెడ్డి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. అంతటితో చర్యలు ఆగిపోయాయి. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కీలక నేతలు, ముఖ్య నాయకులు ఎవరో ఇంతవరకు ఎకై ్సజ్ అధికారులు కూడా ప్రకటించలేదు. ఒకరి వెనుక ఒకరుగా అరెస్టు అవుతున్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చుతూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్టు ప్రక్రియనే పూర్తి కాలేదు. నకిలీ మద్యం తయారీ, వాటి సరఫరా గురించి మాత్రమే దర్యాప్తులో గుర్తించారు. నిజానికి ఈ నకిలీ మద్యం ఎవరెవరికి చేర్చారు.. ఏయే మద్యం దుకాణాలకు వెళ్లింది..ఎంత పరిమాణంలో తయారైంది అన్న వివరాలపై దర్యాప్తు అడుగు కూడా ముందుకు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేయడంతో స్పష్టత వస్తుందా లేదా అన్నది చూడాలి.
● నకిలీమద్యం తయారీ ప్లాంట్ వ్యవహారం, తరలింపు, విక్రయాల్లో విజయవాడకు చెందిన అద్దేపల్లె జనార్దనరావుతో స్థానిక టీటీపీ నేతలంతా జత కట్టినట్టు స్పష్టం అవుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఏ–1 జనార్దనరావు రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలు..టీడీపీ నేతలతో ఎంత గట్టి అనుబంధం ఉందో స్పష్టం చేసింది. మిత్రుడు జయచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయనకు మద్దతుగా వెళ్లినట్టు పేర్కొన్నాడు. అక్కడ టీడీపీ నేతలతో పరిచయాలు, మద్యం వ్యాపారంలో నష్టాలు, లాభాల కోసం నకిలీ మద్యం తయారు..ఇలా అన్నింటికి టీడీపీ నేతలు కలసికట్టుగా జట్టుకట్టినట్టు నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.
కేసులో ఏ–1 జనార్దనరావు ఏ–2 కట్టా రాజుకు ఫోన్ చేసి నకిలీమద్యం తయారీకి సంబంధించి చర్చించి, ప్లాంట్ ఏర్పాటులో ఎవరెవరి పాత్ర ఉందో రిమాండ్ రిపోర్ట్‌లో కట్టారాజు చెప్పినట్టు ఎకై ్సజ్ పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. కొడాలి శ్రీనివాసరావు పేరిట మూతపడిన డాబాను లీజుకు తీసుకున్నాక కాంపౌండ్ గోడను 10 అడుగులకు పెంచారు. త్వరలోనే నకిలీ మద్యం అమ్మకాలు ప్రారంభించాలని జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన నకిరేకంటి రవి, ఆంధ్రావైన్స్ లైసెన్స్‌దారు కట్టా సురేంద్రనాయుడు, రాక్‌స్టార్ లైసెన్స్‌దారు టి.రాజేష్ ప్రణాళిక వేశారు. బాలాజీ వాటర్‌ప్లాంట్, ఎస్‌ఎస్ ట్యాంకు, ఎలక్ట్రికల్ మోటారు, స్పిరిట్ డబ్బాలను షెడ్డుకు తీసుకొచ్చాడు. జనార్దనరావు, రవిలు లేబుళ్లు, పెట్ బాటిళ్లు, క్యాప్‌లు, హీల్స్‌ను తీసుకొచ్చారు. మూడు సీలింగ్ మిషన్లలో రెండింటిని జనార్దనరావు తన వాహనంలో రెండుసార్లు తీసుకొచ్చారు. తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో డాబాల్లో పనిచేస్తున్న నలుగురిని బాలాజీ సహయంతో జనార్దనరావు తీసుకొచ్చారు. జనార్దన రావు బార్‌లో పనిచేస్తున్న సయ్యద్ హాజీ ద్వారా ఒడిశా నుంచి ఇద్దరిని రప్పించి నకిలీమద్యం తయారీని ప్రారంభించి ప్రజలకు తాపించి వారి ఆరోగ్యంతో చెలగాటం అడారు.
నకిలీ మద్యం కేసులోవెలుగులోకి వస్తున్న ఒక్కొక్కరు
ములకలచెరువు నకిలీమద్యం కేసులో ఇప్పటికి నిందితుల సంఖ్య 23. ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. మిగిలి వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.కాగా ఆరెస్ట్ అయిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎకై ్సజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించగా సోమవారం నిర్ణయం వెలువడనుంది.