రైలు కింద పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి మహిళ మృతి

Oct 12 2025 6:49 AM | Updated on Oct 12 2025 6:49 AM

రైలు కింద పడి మహిళ మృతి

రైలు కింద పడి మహిళ మృతి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప–కనుమలోపల్లె మార్గంలో కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి గుర్తు తెలియని శనివారం మహిళ మృతిచెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.... మృతురాలికి 50 సంవత్సరాల వయస్సు ఉందన్నారు. మృతురాలి ఆచూకీ లభించకపోవడంతో మహిళ మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీలో భద్రపరిచారు. ఆమె వద్ద ప్లాస్టిక్‌ సంచిలో ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు ఉన్నాయని, బాటిల్స్‌ ఏరుకుని జీవనం సాగించేదని తెలియవచ్చిందన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్‌పై దాడి

కడప అర్బన్‌ : కడప నగరంలోని మాసాపేట వద్ద బ్లూ కోల్ట్స్‌ కానిస్టేబుల్‌పై దాడి చేసిన పలువురిపై కేసు నమోదు చేశారు. కడప టూటౌన్‌ లో పనిచేస్తున్న బ్లూ కోర్టు కానిస్టేబుల్‌ నాలుగు రోజుల కిందట రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మాసాపేట వద్ద ఓ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌ ఫంక్షన్‌ జరుగుతోంది. ఈ సమయంలో డీజే వేస్తుండడంతో అడ్డుకున్నారు. ఈ సంఘటనలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి, మరో వ్యక్తి కలిసి బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేశారు.

విద్యార్థికి సత్కారం

పులివెందుల టౌన్‌ : మానవ శాస్త్రం విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థిని స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, తదితరులు ఘనంగా సత్కరించారు. పట్టణంలోని గోపీ విహార్‌ స్ట్రీట్‌లో నివాసముంటున్న దివంగత బొంపెమ్‌ హరినాథ్‌, టీచర్‌ గోటూరు ఉషారాణిల కుమారుడు బొంపెమ్‌ ప్రణీత్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఎంఏ మానవశాస్త్రం చదువుతున్నారు. ఈ విభాగంలో బొంపెమ్‌ ప్రణీత్‌ మూడు గోల్డ్‌ మెడల్స్‌ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా రాజు, సేవా సమితి సభ్యులు ప్రణీత్‌కు సత్కరించారు. రాజు మాట్లాడుతూ ప్రణీత్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్‌ రఫీ, సురేష్‌, రాజు, రాజా, తదితరులు పాల్గొన్నారు.

స్కార్పియో దొంగల అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప నగరంలోని తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అలంకాన్‌ పల్లి సమీపంలో ఫ్రెండ్స్‌ కార్‌ గ్యారేజ్‌లో ఉంచిన స్కార్పియో వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సెప్టెంబర్‌ 5న దొంగలించుకుని వెళ్లారు. తగిన ఆధారాలతో కడప తాలూకా సీఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్సై తాహిర్‌ హుస్సేన్‌ తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితులను ఇద్దరిని శనివారం రామరాజు పల్లి వై–జంక్షన్‌ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్కార్పియో స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌ అయిన వారిలో అమలాపురం పరిధిలో ఆత్రేయపురానికి చెందిన కారుటూరు సూర్య తేజ, విజయవాడకు చెందిన జోసెఫ్‌ ఉన్నారు. సూర్య తేజ పై ఇప్పటికే వివిధ పోలీస్‌ స్టేషన్లో పరిధిలో 41 కేసులు నమోదయి ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో బయటపడినట్లు తెలిపారు.

ఒకరికి గాయాలు

సుండుపల్లె : మండలంలోని మిట్టబిడికి కాలనీలో శనివారం మధ్యా హ్నం జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. నాగేశ్వర నాయ క్‌ గొర్రెలు మేపుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్‌ అతన్ని ఢీకొంది. నాగేశ్వరనాయక్‌ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement