
వృద్ధుల కోసం ప్రత్యేక నేత్ర సంరక్షణ కార్యక్రమాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలో వయో వృద్ధుల నేత్ర సంరక్షణలో భాగంగా అత్యాధునిక నేత్ర వైద్య సేవలు అందిస్తున్నట్టు వృద్ధుల నేత్ర సంరక్షణ విభాగాధిపతి డాక్టర్ అవినాష్ పతేంగే తెలిపారు.అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ప్రాంగణంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాల ముగింపు సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాంపస్‌తో పాటు తమ ఎల్వీపీఈఐ ఇతర క్యాంపస్‌లలో కూడా ఎల్డర్లీ ఐ కేర్ సెంటర్స్ ( ప్రత్యేక వృద్ధుల నేత్ర సంరక్షణ కేంద్రాలు) అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవి వృద్ధాప్యంలో వచ్చే నేత్ర సమస్యల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు. వృద్ధాప్యంలో కలిగే జ్ఞాపక శక్తి లోపాలు, పోషకాహార లోపం, వినికిడి లోపం, దృష్టి లోపం సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స సూచిస్తాయని చెప్పారు.