
బిగుస్తున్న ఉచ్చు!
మదనపల్లె: ములకలచెరువు నకిలీమద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో ముఖ్య నిందితుల చుట్టూ కేసు తిరుగుతోంది. ఇందులో టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి వద్ద పనిచేసిన వారు కేసులో ముగ్గురు నిందితులుగా ఉండటం గమనార్హం. నకిలీమద్యం తరలించే వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్‌చేసిన ఎకై ్సజ్‌పోలీసులు తంబళ్లపల్లె కోర్టుసెలవు కారణంగా శనివారం మదనపల్లెలోని తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హజరుపరిచారు. కేసు, రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన ఆయన.. నిందితునికి ఏడురోజుల రిమాండ్ విధించగా మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
జనార్దనరావే చేయించాడు
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అష్రఫ్ టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి (ఏ–17 నిందితుడు) వద్ద ఆరునెలలు పనిచేశాడు. నల్లరంగు స్కార్పియో వాహనానికి డ్రైవర్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే కేసులో ఏ–1 జనార్దనరావుతో పరిచయం ఏర్పడింది. తర్వాత డ్రైవర్‌గా తీసివేయడంతో ములకలచెరువు మార్కెట్ యార్డులో కూలీ పనులు చేసుకొంటూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం మంత్రి గిరిధర్‌రెడ్డి (ఏ–18 నిందితుడు, జయచంద్రారెడ్డి బావమరిది)ని ఏదైనా పని చూపించమని కోరగా మద్యం దుకాణం లేదా క్వారీలో పని ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత జనార్దనరావును కలిసి పని కావాలని చెప్పగా రెండు–మూడురోజులకు ఒకసారి నల్లరంగు స్కార్పియో వాహనంలో బెల్టుషాపులకు నకిలీమద్యం సరఫరా చేయాలని, దీనికి రోజుకు రూ.800 కట్టారాజు (ఏ–2 నిందితుడు) ఇస్తాడని జనార్దనరావు తెలిపాడు. అంగీకరించిన అష్రఫ్ జనార్దనరావు చెప్పినట్టు తన బైక్‌ను జయచంద్రారెడ్డి ఇంటివద్ద ఉంచాక ఆయన ఇంటిలో పనిచేస్తున్న అన్బురాసు అలియాస్ బాబు (ఏ–19 నిందితుడు) వాహనం తాళాలు తెచ్చి ఇచ్చేవాడు. వాహనంలో రాక్‌స్టార్ మద్యం దుకాణం వద్దకు వెళ్లి నకిలీమద్యం తీసుకుని బెల్టుషాపులకు తరలించేవాడినని. ఈ విషయం జయచంద్రారెడ్డి,అన్బురాసుకు తెలుసని, నకిలీమద్యం సరఫరా మొత్తం తనతో జనార్దనరావు చేయించినట్టు వాంగ్మూలంలో అష్రఫ్ పేర్కొన్నాడు.
ఈ కేసులో జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్‌ను కీలకమైన నిందితునిగా ఎకై ్సజ్ పోలీసులు భావిస్తున్నారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన రాజేష్ పేరిట ఒక మద్యం దుకాణం, నకిలీమద్యం తరలించిన వాహనం ఉన్నాయి. ఇవికాక కురబలకోట మండలంలో కోట్ల విలువైన భూములు ఇతని పేరిట రిజిస్ట్రేషన్ జరిగి ఉండటం వెలుగుచూసింది. ఇవికాక ఇతర విషయాలు వెలుగులోకి రావాలంటే రాజేష్ అరెస్ట్ కీలకమని చెబుతున్నారు. విచారణలో మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు. ఈ కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఎకై ్సజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన అష్రఫ్‌తో కలిపి ఇప్పటిదాకా 14 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, అన్బురాసు, బాలాజీ, సుదర్శన్, రవి, శ్రీనివాసులురెడ్డి, చైతన్యబాబు అరెస్ట్ కావాల్సి ఉంది.

బిగుస్తున్న ఉచ్చు!