
డిసెంబరు 23న అంతర్జాతీయ సదస్సు
రాజంపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిసెంబరు 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి తెలిపారు. ఏయూ వీసీ చాంబర్‌లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో ఏయూ మరింత ముందంజలో నిలుస్తుందని, నేటి యుగం డేటా ఆధారంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి మాట్లాడుతూ డేటాసైన్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి నడిపించే శక్తులుగా మారాయన్నారు. ఆధునిక సాంకేతిక రంగాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులు తమ పరిశోధనాపత్రాలను సమర్పించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటీఎస్ వైస్ ఛ:ర్మన్ చొప్పాఎల్లారెడ్డి, ప్రిన్సిపల్ డా.నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఆడ్మిషన్స్ డా.జయరామిరెడ్డి, ప్రోగ్రాం చైర్ డా.చిన్నబాబు, కన్వీనర్ నాగరాజు, పబ్లికేషన్ చైర్స్ డా.పహీముద్దీన్, డా.వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.షేక్ కరీముల్లా పాల్గొన్నారు.
అన్నమాచార్య యూనివర్సిటీ
అధినేత చొప్పా గంగిరెడ్డి