
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పార్నపల్లె విద్యార్థులు
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల హెడ్మాస్టర్ అర్జున్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్లలో ఇటీవల జరిగిన సాఫ్ట్‌బాల్ ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగంలో తమ పాఠశాలకు చెందిన నాగ చైతన్య అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే 9వ తరగతి చదువుతున్న ప్రేమ్, హరిహరన్ జిల్లాస్థాయి ఎస్‌టీఎఫ్ అండర్–17 బీచ్ వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరి ఎంపికపట్ల హెడ్మాస్టర్‌తోపాటు పీడీ విక్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పార్నపల్లె విద్యార్థులు