దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Oct 10 2025 6:08 AM | Updated on Oct 10 2025 6:08 AM

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు బోటనీ పాఠ్యాంశాలు బోధించడానికి గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ త్రివిక్రమ్‌రెడ్డి తెలిపారు. బోధనలో పూర్వ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు పనిచేసిన గంటల పరిమితిలో గరిష్టం రూ. 27 వేలు గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. అర్హత ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ నాటికి కళాశాల కార్యాలయానికి చేరాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

23 మందికి షోకాజ్‌ నోటీసులు

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 23 మంది మహిళా పోలీసులకు మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డి గురువారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గత శని, ఆదివారాల్లో జీఎస్టీతోపాటు ఇన్సూరెన్ప్‌పై కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కాలేదని 23 మందికి నోటీసులు జారీ చేశారు.

బాధ్యతల స్వీకరణ

కడప అగ్రికల్చర్‌ : జిల్లా పశుసంవర్థశాఖ అధికారి( పశుసంవర్థశాఖ జాయింట్‌ డైరెక్టర్‌)డాక్టర్‌. శ్రీనివాసులు గురువారం కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్థశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన పులివెందులలోని పశుసంవర్థశాఖ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవలే బదిలీపై జిల్లా పశుసంవర్ధశాఖ అధికారిగా వచ్చారు. ఈ మేరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు జిల్లా పశుసంవర్దశాఖ అధికారిగా పనిచేస్తున్న శారదమ్మ పులివెందులలోని పశుసంవర్థశాఖ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి జాయింట్‌ డైరెక్టర్‌గా వెళ్లారు.

11న రాష్ట్రస్థాయి

ఖోఖో ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కృష్ణాజిల్లా లోని గన్నవరం హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఈ నెల 11న రాష్ట్రస్థాయి డైరెక్ట్‌ నేషనల్‌ సెలక్షన్స్‌ జరుగుతాయని అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ ఉమ్మడి జిల్లాల ఖో ఖో సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కె. రామసుబ్బారెడ్డి ,కార్యదర్శి జె. నరేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న వారు ఈ నెల 24 నుంచి 26 వరకు కర్ణాటకలో సీనియర్స్‌ సౌత్‌ జోన్‌ ఖో ఖో జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనవలసి ఉంటుందన్నారు. సౌత్‌ జోన్‌ ఎంపికలకు ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు 9849713690 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ప్రారంభమైన కౌన్సెలింగ్‌

కడప ఎడ్యుకేషన్‌ : నూతనంగా ఎంపికై న గురువులకు పోస్టింగ్‌ కేటాయింపుల కోసం గురువారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైయింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లకు మదనపల్లి ట్రెనింగ్‌ కేంద్రంలో కాగా ఎస్జీటీలకు కడప గ్లోబల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ప్రారంభమైయింది. ఈ కౌన్సెలింగ్‌ శుక్రవారం కూడా కొనసాగనుంది.

13 నుంచి టాలెంట్‌ హంట్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : అండర్‌ 12, 14, 16,19 క్రికెట్‌ క్రీడాకారులకు టాలెంట్‌ హంట్‌ జరుగుతుందని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే ఈ టాలెంట్‌ హంట్‌కు ఏసీఏ నుంచి కే. రవిశంకర్‌ టాలెంట్‌ కమిటీ మెంబర్‌ విచ్చేసి సెలెక్షన్స్‌ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మంచి ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 13న అండర్‌– 12 క్రీడాకారులు,14న అండర్‌– 14 క్రీడాకారులు, 15న అండర్‌ –16 క్రీడాకారులు 16న అండర్‌ –19 క్రీడాకారులు హాజరుకావాలన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ కిట్‌లతో పాటు ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్‌ , ఒక పాసుపోర్టు సైజు ఫొటోతో వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియానికి ఉదయం 8 గంటలకు రావాలని కోరారు.

మానసిక ఒత్తిడికి

దూరంగా ఉండాలి

కడప ఎడ్యుకేషన్‌ : విద్యార్థులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నప్పుడే మంచి ప్రతిభను సాధించగలరని దీంతో మంచి విజయాలను సాధించగలరని సమగ్రశిక్ష జీసీడీఓ దార్ల ఆరోగ్య మేరీ అన్నారు. కడప నగరం చిన్నచౌకులోని ప్రభుత్వ అంబేద్కర్‌ గురుకుల కళాశాలలో గురువారం ప్ర పంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమబద్ధమైన జీవనశైలి , ప్రశాంతమైన దినచర్య ఉంటే శారీరకంగా మానసికంగా బలిష్టంగా ఉంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement