
విధుల్లోకి సీఐ రామకృష్ణ
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఒన్‌టౌన్ సీఐ బి. రామకృష్ణ వి.ఆర్‌కు సెప్టెంబర్ 29వ తేదీన వెళ్లారు. బుధవారం మరలా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన ఒన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు వేరే కేసుపై విచారణ కోసం విధులకు వెళ్లి వచ్చానని తెలిపారు.
ఉల్లి రైతులను ఆదుకోవాలి
కమలాపురం : జిల్లాలోని ఉల్లి రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి కోరారు. వర్షాలతో ఉల్లి రైతులు గుల్ల కావడంతో గత నెల ఉమ్మడి కడప జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు క్వింటా ఉల్లి రూ.1200 కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే సీఎం ఇచ్చిన ఆ హామీ క్షేత్ర స్థాయిలో అమలు కాక పోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి నాగేశ్వర రావు, రైతులు రామసుబ్బారెడ్డి, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.