
పితృదేవతలకు సామూహిక పిండ ప్రదానం
వల్లూరు : పుష్పగిరి కొండపై వెలసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో రుద్రపాదం వద్ద ఆదివారం పితృదేవతలకు సామూహిక పిండ ప్రదాన కార్యక్రమం భక్తి శద్ధలతో నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినవారు తమ పితృ దేవతలు, బంధువులకు పిండ ప్రదానం చేశారు. రుద్రపాదం వద్ద పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడంతో వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో పేర్కొనబడిందని వివరించారు. దేవస్థానం అధికారులు భక్తులకు పిండ ప్రదాన సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం నదిలో స్నానాలు చేసిన భక్తులు రుద్రపాదానికి పూజలు జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఈవో శ్రీనివాసులు, అఖిల్, సుమంత్ పాల్గొన్నారు.