
●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం
పోలీసుస్టేషన్ భూమికి ఎసరు
ఖాళీ జాగాలు కనిపిస్తే చాలు ‘పచ్చ గద్దలు’ వాలిపోతున్నాయి.. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను పట్టపగలే మింగేస్తున్నాయి. కొండల్ని..గుట్టల్ని సైతం తవ్వేస్తూ చెరబడుతున్నాయి.. అధికార ఒత్తిడికి తోడు..
అక్రమ సొమ్ము జేబుల్లోకి చేరడంతో అధికార యంత్రాంగం దగ్గరుండి మరీ
‘తమ్ముళ్లకు’ కొమ్ముకాస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో భూ దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు..కార్యకర్తల భూదాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కోట్లాది రూపాయాల విలువైన ప్రభుత్వ భూమి పరులపాలవుతుంటే.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం అధికార మత్తులో జోగుతోంది.
● అట్లూరు మండల పరిధిలోని నల్లాయపల్లి రెవెన్యూ పొలంలో సర్వేనెంబరు 40లో 445.81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సారవంతమైన ఆ భూమి వ్యవసాయానికి అనువుగా ఉంది. బద్వేల్ మండలానికి చెందిన తెలుగుతమ్ముళ్లకు ఆ భూమిపై కన్నుపడింది. అంతే.. జేసీబీ యంత్రాలు, డోజర్ ట్రాక్టర్లతో యధేచ్ఛగా చదును చేశారు. పట్టపగలు బాహాటంగా ఆక్రమణలకు పాల్పడుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. స్థానికులు సమాచారమిచ్చినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వీఆర్వోను పంపించి చేతులు దులుపుకున్నారు. పైగా ఆక్రమణదారులకు సమాచారం అందించారు. స్థానికులు అప్పగించిన జేసీబీ సైతం తర్వాత వదిలేశారు. దాదాపు 40 ఎకరాల మేరకు చదును చేసినట్లు స్థానికులు వివరిస్తున్నారు.
ప్రభుత్వ భూమిగా నిర్ధారించినా..
బద్వేల్ నియోజకవర్గంలో అధికారపార్టీకి రెవెన్యూ యంత్రాంగం అండగా నిలుస్తోంది. బి.కోడూరు మండలం వేముకుంట గ్రామంలో సర్వే నంబర్ 18లో 16.50 ఎకరాలు ప్రభుత్వ గయ్యాలి భూమిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన అనుచరుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేపధ్యంలో గ్రామస్తులు రెవెన్యూ కోర్టులను ఆశ్రయించారు. రాజంపేట ఆర్డీఓ కోర్టు (ఈ3)/1916/2016లో ద్వారా 2016లో ప్రభుత్వ గయ్యాలి భూమిగా తీర్పు ఇచ్చింది. ఆపై విజయమ్మ తనయుడు ప్రస్తుత టీడీపీ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా జేసీ కోర్టు సైతం ఆర్డీఓ కోర్టు తీర్పును సమ్మతిస్తూ ప్రభుత్వ గయ్యాలి భూమిగా డిసెంబర్ 23, 2022 తేదిన ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్డీఓ, జేసీ కోర్టుల తీర్పునసరించి బి.కోడూరు తహసీల్దార్, వేముకుంట ప్రజల సమక్షంలో పంచనామా చేపట్టారు. సర్వేనంబర్ 18లో 16.50ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమి బోర్టు పెట్టారు.
కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటులో భాగంగా 1.38 ఎకరాలు తాళ్లప్రొద్దుటూరు పోలీసుస్టేషన్‌కు కేటాయించారు. ఆమేరకు తహసీల్దార్ రెఫెరెన్స్ నెం.ఏ/785/2021తో డిసెంబర్ 13, 2021న పొజిషన్ సర్టిఫికెట్ కూడా అప్పగించారు. ఇప్పుడా స్థలంపై కూటమి నేతల కన్ను పడింది. నేషనల్ హైవే–67 రోడ్డుపక్కనే ఉండడంతో సెంటు రూ.3లక్షలు పలుకుతోంది. అందులో 50 సెంట్లు భూమి కొట్టేసేందుకు సరికొత్త వ్యూహం పన్నారు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా స్థానికంగా పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. ఆ మేరకు సిఫార్సులు చేస్తూ కలెక్టరేట్‌కు ఫైల్ పంపించారు. విషయం తెలుసుకున్న మునుపటి ఎస్పీ అశోక్‌కుమార్ జాయింట్ కలెక్టర్‌కు అభ్యంతరం చెబుతూనే, ఆ స్థలానికి కంచె వేయించారు. పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రజలు కూడా వాదిస్తున్నా అవేవి పట్టించుకునే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఆలోచనలు కన్పించడం లేదు. పెద్ద మొత్తంలో చేతులు మారడడంతో పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని కూడా అప్పగించేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు పరులుపాలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు
బద్వేలు నియోజకవర్గ పరిఽధిలోక్రమం తప్పకుండా భూదందాలు
ప్రభుత్వ భూములపై కన్నేసిన ‘తమ్ముళ్లు’
కట్టడి చేయకపోగా, అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులు
ప్రభుత్వ భూమిగా ఆర్డీఓ, జేసీ కోర్టులు నిర్దేశించిన సదరు భూమిపై హైకోర్టు స్టేటస్–కో 2022లో ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మూడేళ్లుగా కోట్లాది రుపాయాలు విలువైన భూముల విషయంలో రెవెన్యూశాఖ చేష్టలుగి చూస్తుండి పోయింది. బహిరంగ మార్కెట్‌లో రూ.3కోట్లు పైబడి పలికే వేముకుంట ప్రభుత్వ గయ్యాలి భూమి రితేష్‌రెడ్డి ధాదాదత్తం చేసేందుకు సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి.

●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం

●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం

●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం

●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం