
వాన వెల్లువాయె!
జిల్లాలో దంచి కొట్టిన వర్షం
మేఘం గర్జించింది.. చిమ్మ చీకటి వేళ.. కమ్ముకొచ్చి కుండపోతగా కురిసింది..అంతే
తెల్లారేకల్లా వాగు ఉప్పొంగింది. నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది..
ఇల్లంతా నీరు... ఊరంతా ఏరయింది.
ఇక పంటంతా నీటిలో మునిగింది.. రైతు కంట కన్నీరొలికింది. గురువారం తెల్లారుజామున కురిసిన వర్షం..
పలు మండలాల్లో బీభత్సమే సృష్టించింది.
వల్లూరు: కోట్లూరు పొలాల్లో నేలకొరిగిన వరి
ప్రొద్దుటూరులో రోడ్డుపై వర్షపు నీరు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున కుండపోత వాన కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో కంది, మినుము, ఉల్లి, జొన్నలతోపాటు పలు ఆరుతడి పంటల్లో వర్షపు నీరంతా నిలి చింది. పంట పొలాల్లో నిలిచిన వర్షపునీరు వంకలను తలపించాయి. జిల్లాలో ఎర్రగంట్ల మండలంలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురవడంతో పొట్లదుర్తిలోని ఎన్‌టీఆర్‌కాలనీ, ఎర్రగుంట్లలోని సుందరయ్యకాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎర్రగుంట్ల్ల ప్రొద్దుటూరు మద్య ప్రధా న రహదారిలోని కుంది నదీ ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పులూరులో మసీదు ప్రహారీ కూలిపోయింది. పాగేరు వంక ఉధృతంగా ప్రహించడంతో
కమలాపురం– ఖాజీపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే పెద్దముడియం మండలం పాలూరులోని నోస్సం వంక ఉధృతంగా ప్రవహించింది. కన్నెలూరులోని నివా సం ఉన్న ఓ కుటుంబం బైక్‌లో నొస్సం వంక దాటుతుండగా అదుపుతప్పి కొట్టుకపోతుండటంతో పాలూరుకు చెందిన కొంతమంది యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. అలాగే ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో రాజుపాలెం వెంగలాయపల్లి గ్రామాల మధ్యలో మడువంకపై వర్షపు నీరు ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దముడియంలో పంటపొ లాల్లో నీరు నిలిచి చెరువులను తరలించాయి. ఈ వర్షంతో విత్తిన మినుమంతా భూమిలోనే కుల్లిపోతుందని రైతులు వాపోయారు. ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కడప నగరంలోని ఫాతిమా కాలేజ్ వద్ద..
పలు కాలనీలు జలమయం
పలుచోట్ల రాకపోకలు బంద్
ఉద్యానపంటలతోపాటువ్యవసాయ పంటలకు నష్టం

వాన వెల్లువాయె!

వాన వెల్లువాయె!

వాన వెల్లువాయె!

వాన వెల్లువాయె!

వాన వెల్లువాయె!

వాన వెల్లువాయె!