
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం కడప నగరంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగానికిగానీ, పోలీస్ వ్యవస్థకుగానీ ఇసుమంతైనా చలనం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు తమను తాము పెద్ద రాజుల స్థాయిలో ఊహించుకుంటూ ఓ చేత్తో రెవెన్యూ, మరో చేత్తో పోలీసులను పెట్టుకొని ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇక శాంతిభద్రతలు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం కదా...వాటిని నియంత్రించ లేనిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యులకు పాలనాపగ్గాలు అప్పగించామా...అని ప్రజలు చింతిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పి. జయచంద్రారెడ్డి, జమాల్‌వలీ, షఫీ, సుభాన్‌బాషా, త్యాగరాజు, షంషీర్, గౌస్, అక్బర్ పాల్గొన్నారు.
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప ఆలంఖాన్‌పల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అన్నారు. జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందు రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రజలు పాల్గొన్నారు.
మిలాద్ ఉన్ నబీ ప్రార్థనల్లో ఎంపీ
మిలాద్ ఉన్ నబీ మాసోత్సవం సందర్భంగా కడప లోని శ్రీక్రిష్ణ దేవరాయ సర్కిల్ సమీపంలో వైఎస్సార్‌సీపీ నేత ఎస్‌ఎండీ ఆజమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజద్‌బాషా
ప్రజా దర్బార్‌లో నాయకులతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్
ఇంత జరుగుతున్నా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగంలో చలనం లేదు
తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు