
ప్రతి రైతుకు యూరియా అందిస్తాం
దువ్వూరు: మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని చింతకుంట గ్రామంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దువ్వూరు మండలానికి 13,560 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు కాగా, ఇంత వరకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని కలెక్టర్ అడిగిన ఓ ప్రశ్నకు జేడీఏ చంద్రానాయక్ సమాధానమిచ్చారు. ఇంత స్థాయిలో యూరియా వచ్చినా రైతులకు యూరియా అందలేన్న సమస్య ఎందుకు వస్తోందని కలెక్టర్ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. అనంతరం సచివాలయంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కొంత మంది రైతులకే యూరియా అందుతోందని, యూరియా కోసం క్యూలో ఉన్నా అందడం లేదని పలువురు వాపోయారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, పూర్తి స్థాయిలో యూరియా అందిస్తామని తెలిపారు.
ఉల్లి రైతులకు న్యాయం చేస్తాం
ఖాజీపేట: ఉల్లి పంటకు సరైన పరిహారం అందించి.. రైతులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ శ్రీధర్ భరోసా ఇచ్చారు. ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె లో ఉల్లి రైతులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. పొలంలోని పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర దక్కడం లేదని పలువురు రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తహసీల్దార్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్