
తోటల వద్దే కొనుగోలు చేయాలి
తోటల వద్దే ఉల్లి దిగుబడులు కొనుగోలు చేయాలి. మార్క్‌ఫెడ్ అధికారులు రైతులను దిగుబడులు అక్కడికి తీసుకురమ్మంటున్నారు. తీసుకెళ్లిన తర్వాత గ్రేడింగ్ చేసి ఖచ్చితమైన ధర రావచ్చు.. రాకపోవచ్చు అంటూ చెబుతున్నారు. దీంతో మార్కెట్‌కు రావాలంటే భయం వేస్తోంది. కర్నూల్ మార్కెట్‌లో రైతుకు క్వింటా రూ.500 నుంచి రూ.350 వరకు ధర ఇవ్వడంతో ఉల్లిగడ్డలను రోడ్డుపై పారబోశారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద కొనుగోలు చేయాలి.
– మల్లికార్జునరెడ్డి, ఉల్లి రైతు, అహోబిలం