వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Sep 19 2025 1:53 AM | Updated on Sep 19 2025 1:53 AM

వ్యక్

వ్యక్తి అదృశ్యం

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డుకు చెందిన రసూల్‌(50) అదృశ్యమైనట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. ఈనెల 16న ఇంట్లో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈనెల 17న తెల్లవారుజామున నుంచి అతను కనిపించకుండా పోవడంతో భార్య రషీద కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల గాలించింది. అతని ఆచూకీ లభించకపోవడంతో గురువారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళ అదృశ్యం

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆణాబంకు వీధిలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన ఇంద్రకంటి విజయలక్ష్మి (53) అదృశ్యమయ్యారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగిరాలేదు. ఆమె పట్టణంలో పలు చోట్ల అప్పులు చేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోటకు చెందిన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తమ్మిశెట్టి రామాంజ నేయులుకు కడప కోర్టు జడ్జి డాక్టర్‌ సి.యామిని పదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధించినట్లు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. వివరాలలోకి వెళితే.. వేంపల్లె గ్రామంలోని పుల్లయ్యతోట వీధికి చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులు వృత్తి రీత్యా పెయిటింగ్‌ పనిచేస్తున్నాడు. 2019 ఆగస్టు, 26న అదే వీధికి చెందిన మైనర్‌ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విచారించిన జడ్జి నిందితుడికి పదేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు.

జూదరుల అరెస్టు

ఖాజీపేట : జూదమాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్‌ తెలిపారు. నాగసానిపల్లె పొలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని, వారి నుంచి రూ.78,470 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, ఏడు బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కడప సెవెన్‌రోడ్స్‌ : లాటరీ ద్వారా జిల్లాలో ఏడు బార్లను గురువారం కేటాయించారు. జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులకు బార్లను కేటాయించారు. కడపలో నాలుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్‌లలో ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్‌ ఎకై ్సజ్‌ అధికారి రవికుమార్‌, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం 1
1/2

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం 2
2/2

వ్యక్తి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement