
ఆర్భాటం.. హంగామా.. అంతలో వెనక్కు
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరినీ విజయవాడకు పిలిపించి ఏదో హంగామా చేయాలని భావించారు.. వారికి ఆర్భాటంగా నియామక పత్రాలను అందిస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆఘమేఘాలపై పరుగున వచ్చారు. దీరా అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినందున నిలిపివేశామనడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులు, వారికి తోడుగా వచ్చే బందువులను విజయవాడకు తరలించేందుకు కడప డీఈఓ కార్యాలయం వద్ద బస్సులను(జిల్లా నుంచి 40 బస్సులు) సిద్ధం చేశారు. నలుమూలల నుంచి చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేకువగానే కడప డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టిఫిన్ చేసి బయలు దేరేందుకు బస్సులు కూడా ఎక్కారు. ఇంతలోనే కార్యాక్రమం రద్దు చేశారని మేసేజ్ వచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు నిరుత్సాహ పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ వెనక్కు వెళ్లారు. డీఈఓ షేక్ షంషుద్దీన్‌తో మాట్లాడగా అధిక వర్షంతో విజయవాడలో కార్యక్రమం రద్దు అయిందని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలో మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులకు తెలియచేస్తామని తెలిపారు.
డీఎస్సీ అభ్యర్థులకు నిరుత్సాహం