ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు

Sep 8 2025 7:14 AM | Updated on Sep 8 2025 7:14 AM

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్‌ షౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా సాగాయి. అండర్‌ –18, 20 సీ్త్ర,పురుషులకు నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్‌జంప్‌, జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌, హైజంప్‌ విభాగాలలో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో 20 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 26, 27 తేదీల్లో ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు శివారెడ్డి, రాఘవ, నాగేశ్వరరావు, ఖాదర్‌రెడ్డి, దిలీప్‌, హసీనా, బాషా అథ్లెటిక్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి అహమర్‌బాషా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement