
క్లుప్తంగా
క్లుప్తంగా
మైదుకూరు : లాండ్రీ నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు రాజారెడ్డి వీధిలో ఉంటున్న కంచర్ల ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లాండ్రీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫ్రిడ్జ్, మోటార్, టీవీ, బియ్యంతోపాటు ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు, శుభ్రం చేసి ఇసీ్త్ర చేసేందుకు తీసుకొచ్చిన పలువురి పట్టుచీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక అధికారి పి.బసివి రెడ్డి, సిబ్బంది వీరనన్న, రవికుమార్, భాస్కర్, కరీముల్లా సంఘటన జరిగిన ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆంజనేయులు కోరారు.