
సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అర్జున్ టెండ్కూలర్ 64, వికాస్ 53 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ముఖేష్ చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బాలాజీ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్లు 33 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 73, రెడ్డి ప్రకాశ్ 20 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కడప– నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 43.5 ఓవర్లకు 257 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భరత్‌రెడ్డి 66, ఎస్‌ఎండి ఆయూబ్ 51, శివ కేశవ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, ఇకాక్‌షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 53, శ్రీహర్ష 31 పరుగులు చేశారు. కడప జట్టులోని వరుణ్‌తేజ్ రెడ్డి 3 వికెట్లు, చెన్నారెడ్డి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం

సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం