
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (వైఎస్సార్, అన్నమయ్య) జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపికలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణమూర్తి, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్ జిల్లా జట్టుకు బాలురు 10 మందిని, బాలికలు 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14వ తేదిల్లో అనంతరపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్ కన్వీనర్ ఓబయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సెలక్షన్ కమిటీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా బాలుర జట్టు
మహమ్మద్ బాబా (రాజంపేట) కె.కౌశిక్, హైడెన్, డి.రాజేష్, వెంకటేశ్, చిన్న ఓబులేసు (దువ్వూరు) డి.షడ్రక్, రఫెల్ (చిన్న సింగనపల్లె) ఎస్.మురళి, రాజు (ఒంటిమిట్ట) ఎస్. షాజిద్(రాజంపేట)
జిల్లా బాలికల జట్టు
డి.కీర్తి, డి.నయోమి (చిన్న సింగనపల్లె) ఎం.స్వీటీ (ఎస్.ఉప్పలపాడు) జి.వర్షిణీ (తాళ్ల ప్రొద్దుటూరు) ఎం.గౌతమి, జి.సునంద, కె.చెర్లీన్, ఎస్.అశ్వీనీ, ఎస్.లక్ష్మీ (చియ్యపాడు)