
వరాలందించే ఆరోగ్యమాత
● విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్
● ఘనంగా ముగిసిన
ఆరోగ్యమాత ఉత్సవాలు
ముగింపు ఉత్సవాలకు హాజరైన విశ్వాసులు విశేష అలంకారంలో ఆరోగ్యమాత స్వరూపం
కడప సెవెన్‌రోడ్స్ : విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆరోగ్యమాత అందజేస్తుందని విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ అన్నారు. కడప నగరం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన పూజ ప్రార్థన దినోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని, పది రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనలు వైభవంగా జరిగాయన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ఆరోగ్యమాత పతాక అవరోహణ చేశారు. రెవరెండ్ ఫాదర్ బి.జ్వాన్నేస్, రెవరెండ్ ఫాదర్ డేవిడ్‌రాజు పరిశుద్ధ జపమాల, దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం చేశారు. ఉత్సవాల్లో జి.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎర్రగుడిపాడుకు చెందిన ఏసన్న బృందం చెక్కభజన భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురువులు ఎండీ ప్రసాద్‌రావు, ఇతర గురువులు, కన్యసీ్త్రలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

వరాలందించే ఆరోగ్యమాత