
శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్‌చార్జిగా బసవ
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్. బసవరాజును శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్‌చార్జిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సమ్మెట బసవరాజు మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీకి మంచిపేరు తెస్తానని, శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
10 నుంచి ఎస్‌జీఎఫ్
జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి సెలక్షన్స్ ఈ నెల 10 నుంచి 17వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ చంద్రావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల క్రీడా పోటీలతో నిర్వహించే ఈ సెలక్షన్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.
మార్కెటింగ్ ఏడీకి ‘షోకాజ్’
కడప సెవెన్‌రోడ్స్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఆజాద్‌వల్లికి సోమవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి షోకాజ్ నోటీసును జారీ చేశారు. రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
వేంపల్లె : జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు బి.నాగ పవన్, ఎస్.అరవింద్, జి.విజయ్ కుమార్, డి.రవితేజ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారని వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఛత్తీ్‌స్‌ఘడ్ బిలయోలో నిర్వహించే యోగాసన భారత్ జాతీయ స్థాయిపోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డైరెక్టర్‌తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రమేష్ కై లాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ పరీక్షకు నమోదు చేసుకునుటకు ఈ నెల 30 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ పరీక్ష రాయటకు ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యంలేని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3,50,000 లోపు ఉన్న విద్యార్థులందరూ అర్హులు అని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీబీ విద్యార్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇవ్వబడిన ఎస్‌బీఐ కలెక్ట్ లింగ్ ద్వారా మాత్రమే పరీక్ష రుసుం చెల్లించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం వారిని కలవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చూడా లని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి పల్లకీలో ఊరేగారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి స్వామి, అమ్మవారిని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చిరు. మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్‌చార్జిగా బసవ