
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చతుష్ఠార్చన, ద్వారతోరణ, అనంత కళాపూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిత్య హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, ఇతర అర్చకులతోపాటు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కడప రూరల్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని సామాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈవీఎంలపై వ్యతిరేక జాతీయ ఉద్యమ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ కన్వీనర్ సంగటి మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశ ముఖ ద్వారమైన హైదరాబాదులో మధ్యాహ్నం 2 గంటలకు ఈవీఎంలకు వ్యతిరేకంగా చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల నేతలు అవ్వారు మల్లికార్జున, కై పు రామాంజనేయులు, దేవర శ్రీకష్ణ, గుర్రప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో యూనివర్సిటీ పాడ్ కాస్ట్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని కెరీర్ డెవలప్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ కో ఆర్డినేటర్ నందిగం సత్యానంద రాం ఆధ్వర్యంలో నిజమైన చర్చలు, నిజమైన నైపుణ్యాలు, వాస్తవ ప్రపంచం అనే పేరుతో యూనివర్సిటీ పోడ్ కాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో యూఎస్‌ఏ నుంచి సీనియర్ మైక్రో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న మధుసూదన్‌రెడ్డి విద్యార్థులకు ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై సూచనలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి పి.రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.