
రేపు 5కే రెడ్ రన్ మారథాన్
కడప రూరల్: కడప నగరంలో ఈ నెల 6న 5కే రెడ్ రన్ మారథాన్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం ఉదయం 5.30 గంటలకు స్ధానిక మహవీర్ సర్కిల్ నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు అక్కడి నుంచి మహవీర్ సర్కిల్ వరకు మారథాన్ ఉంటుందన్నారు. వివరాలకు సెల్ నంబరు 9866094531, 9052038569 ను సంప్రదించాలని సూచించారు.
ప్రొద్దుటూరు కల్చరల్: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఉమ్మడి కడప (వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల) జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, కార్యదర్శి జి.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94901 81104, 7036907303 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
చింతకొమ్మదిన్నె: జిల్లా పరిషత్ సీఈఓ సి.ఓబులమ్మ స్థానిక చింతకొమ్మదిన్నె ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. జెడ్పీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన పనులకు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ సూచించారు.
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యా యి. నాలుగు రోజులపాటు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం, విశ్వక్సేన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు మయూ రం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణతరుణ్ ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యతను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ యస్.రమణ అన్నారు. గురువారం విద్యుత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడు వులోగా పరిష్కరించాలని, సమస్య మూలకారణాన్ని గుర్తించి సమగ్ర పరిష్కారం అందించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్ మంజూష, జిల్లాలోని ఏఈలు, జేఈలు పాల్గొన్నారు.