
రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తా మని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టిందని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, చీని, మినుము, మిర్చి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు కావా ల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం, ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రైతులకు యూరియాను అందుబాటులో ఉంచలేక, యూరియా ఎక్కువ వాడితే కేన్సర్ వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ సమస్యలన్నింటిపై ప్రత్యక్ష పోరాటం చేయా లని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు జయప్రదం చేయాలని కోరారు. జయచంద్రారెడ్డి, బీహెచ్ ఇలియాస్, బంగారు నాగయ్య, బసవరాజు, అరీఫుల్లా బాషా, కె. బాబు పాల్గొన్నారు.
● ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
● మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా