
యూరియా కోసం పడిగాపులు
నేను ఆరు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాను. యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సచివాలయానికి అరకొర వస్తోంది. అది వస్తే క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి అనుభవించలేదు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరఫరా యూరియాను సరఫరా చేయాలి. – నాగేశ్వర్ రెడ్డి, రైతు, రావులపల్లి, ఖాజీపేట మండలం
కేసీ కెనాల్ పరిధిలో...
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే వర్షాలు బాగా కురవడంతో సాగు పెరుగుతుందని ఆశపడ్డాం. కానీ సజన్ ప్రారంభం తరువాత వరణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో సాగు అనుకున్న మేర కాలేదు. ఇటీవల కురిసిన వర్షానికి ఆరుతడి పంటలసాగు పెరిగే అవకాశం ఉంది. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి

యూరియా కోసం పడిగాపులు