
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా 2వ తేదీ దివంగత మహానేత వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించా రు. మంగళవారం మద్ధతు ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతుల కష్టాలను స్వయంగా రైతుల పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అలాగే అంబకపల్లె గంగమ్మ కుంట చెరువులో జలహారతి ఇచ్చారు. దారిలోని నల్లపురెడ్డిపల్లెలో స్థానికులతో మాట్లాడారు. సోమ, మంగళవారాలలో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలు, పార్టీ కేడర్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారాలను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచిస్తూ ప్రజలు, కార్యకర్తలలో మనో ధైర్యం నింపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మూడు రోజుల పర్యటన విజయవంతం