
వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం పాత మార్కెట్‌లో కృష్ణయ్య యాదవ్ అనే వ్యక్తిపై నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణయ్య యాదవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన కృష్ణయ్య యాదవ్ పని నిమిత్తం పులివెందులకు వచ్చాడు. పులివెందుల పట్టణం నగరిగుట్టలో నివాసముంటున్న నాగరాజు అనే వ్యక్తిని గతంలో బొలెరో వాహనంతో ఢీకొట్టడంతో అప్పట్లో నాగరాజుకు కా లు విరిగింది. ఇది మనసులో పెట్టుకొని సోమ వారం మధ్యాహ్నం పాత మార్కెట్‌లోని కాంప్లెక్స్‌లో ఉన్న కృష్ణయ్య యాదవ్‌పై నాగరాజు దా డి చేశాడు. దీంతో కృష్ణయ్య యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు.
జేవీవీ నూతన కమిటీ ఎన్నిక
ప్రొద్దుటూరు కల్చరల్ : జన విజ్ఞాన వేదిక కడప జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. స్థానిక నందిని క్లాత్ మార్కెట్‌లోని జేవీవీ కార్యాలయంలో జరిగిన మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవదత్తం ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడిగా షామీర్ బాషా, ప్రధాన కార్యదర్శిగా శివరాం, సమత కన్వీనర్‌గా రామసుబ్బమ్మ, ఉపాధ్యక్షులుగా బాలబయన్న, దేవదత్తం, వెంకటసుబ్బయ్య, వెంకటరామరాజు, రవూఫ్ బాషా, పి.మహేష్, కార్యదర్శులుగా రాజేష్, నరసింహారెడ్డి, ప్రసన్న కుమార్, డేవిడ్ రాజ్, ఖాసీంవలి, కిరణ్‌కుమార్‌లను ఎన్నుకున్నట్లు వివరించారు. గౌరవాధ్యక్షులుగా ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ రాజా వెంగళరెడ్డి, రఘునాథరెడ్డి, గౌరవ సలహాదారులుగా కుమారస్వామిరెడ్డి, రామచంద్రారెడ్డి, గోపినాథ్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డిలతోపాటు కార్యవర్గ సభ్యులుగా పది మందిని, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, యూత్, సాహిత్యం, సాంస్కృతిక సబ్ కమిటీ కన్వీనర్, కోకన్వీనర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
పోలీసులతో వాగ్వాదం.. కేసు నమోదు
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాయపల్లి వద్ద గణేశుని విగ్రహాన్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకుని వెళుతున్న క్రమంలో ఆదివారం రాత్రి మల్లికార్జున రెడ్డితో పాటు, మరో నలుగురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు