స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ

Sep 2 2025 7:14 AM | Updated on Sep 2 2025 7:14 AM

స్థల

స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ

కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అక్కంపేట గ్రామానికి చెందిన పాణ్యం నాగేంద్ర, గాలింకి రామచంద్రల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి రక్త గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కంపేట ఎస్సీ కాలనీలో నాగేంద్ర స్థలానికి ఆనుకుని రామచంద్రకు స్థలం ఉంది. ఈ స్థలం గురించి ఇద్దరి మధ్య గతంలోనే మనస్పర్థలున్నాయి. సోమవారం రామచంద్ర తన స్థలంతో పాటు నాగేంద్ర స్థలంలో కూడా కంప కట్టెలు వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమ స్థలంలో కట్టెలు ఎందుకు వేశావని నాగేంద్ర ప్రశ్నించడంతో ఈ స్థలం కూడా మాదేనని రామచంద్ర చెప్పడంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదానికి దిగడంతో పాటు కట్టెలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో నాగేంద్ర చేతులకు, రామచంద్ర తలకు రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన నాగేంద్ర, రామచంద్ర

స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ1
1/1

స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement