
భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లలో చిత్తూరు, నెల్లూరు జట్లు భారీ స్కోర్లు చేశాయి. ఆదివారం రెండవ రోజు కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 137. ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 589 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని వై. తేజ రెడ్డి 162 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. నిఖిత్ గౌడ్ 63 పరుగులు చేశాడు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3 వికెట్లు, ఎస్‌ఎండీ అస్లమ్ 2 వికెట్లు, ధనుష్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 32.4 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 52 పరుగులు చేశాడు. దీంతో కడప జట్టు 490 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 374 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 96.4 ఓవర్లలో 514 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 220 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 182 పరుగులు చేశాడు. భార్గవ్ 75 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 41.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 34 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని అఖిల్ 4 వికెట్లు, మాధవ్ 3 వికెట్లు, నారాయణ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 10 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది. దీంతో నెల్లూరు జట్టు 436 పరుగుల అధిక్యంలో ఉంది, దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు

భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు

భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు

భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు

భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు