
రూ.4,20,999 పలికిన లడ్డూ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక సాయిరాజేశ్వరి కాలనీలోని సాయిరాజేశ్వరి గణపతి ఉత్సవ కమిటీ వారు గణపతి వద్ద ఉంచి పూజ చేసిన లడ్డూ, వెండి కలశం, నోట్ల దండ, వెండి కాయిన్‌లకు వేలం వేశారు. శ్రీ సాయిక్రేన్స్ అధినేత వల్లపు రెడ్డి వరదకుమార్‌రెడ్డి వెండి ప్లేట్ కలిగిన లడ్డూను రూ.4,20,999లకు, వెండి కలశాన్ని రూ.3,36,000లకు వేలంలో దక్కించుకున్నారు. రూ.200 నోట్ల దండను సి.వెంకటగోపాల్ రెడ్డి రూ.1,27,999లకు, వెండి కాయిన్‌ను దొంతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి రూ.1,21,999లకు చేజిక్కించుకున్నారు. వీరిని ఉత్సవ కమిటీ వారు సత్కరించారు.