
ఐజేయూలో ఇరువురికి చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇరువురికి చోటు లభించింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ కడపకు చెందిన జేసీఎన్ ప్రతినిధి రామాంజనేయరెడ్డి, మున్సిఫ్ టీవీ ప్రతినిధి సర్దార్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. ఐజేయూలో ప్రాతినిధ్యం కోసం జిల్లా కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్ర కమిటీ ఆమోదించి శనివారం అధికారికంగా ప్రకటించింది. జిల్లాకు చెందిన ఇరువురి ఎంపిక పట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలకృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు రామసుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు
కడప అర్బన్ : జిల్లాలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమాలకు ఎస్పీ ఈ.జీ.అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టారు. ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాల్లో ఎలాంటి చిన్నపాటి ఘటనలు, అపశ్రుతులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఊరేగింపు, నిమజ్జన ప్రదేశాలలో ప్రత్యేకంగా అత్యాధునిక సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు.
సిద్దయ్య సేవలు అభినందనీయం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప జోన్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పీడీ సిద్దయ్య అందించిన సేవలు అభినందనీయమని డిప్యూటీ సీపీఎం గజలక్ష్మి, డిప్యూటీ సీటీఎం (ఓఅండ్‌సీ)ప్రశాంతి కొనియాడారు. శనివారం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సిద్దయ్యకు ఆర్టీసీ అధికారులు వీడ్కోలు సభ నిర్వహించారు. అనంతరం సిద్దయ్య, విజయలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సేవలు అందించాలన్నారు. ఆర్టీసీలో 1986లో కండక్టర్‌గా విధుల్లో చేరి వివిధ పదవులు పొంది డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పురుషోత్తం, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎజ్రా శాస్త్రి, కుటుంబ సభ్యులు అశ్విని, హరిప్రసాద్, పృథ్వి, మనోజ్, శృతి, సందీప్ పాల్గొన్నారు.
అన్నదమ్ములపై హత్యాయత్నం
మదనపల్లె రూరల్/ములకలచెరువు : ఆస్తి తగాదాల కారణంగా వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు...బురకాయలకోటకు చెందిన రామచంద్ర, హరికుమార్, భారతీయుడు అన్నదమ్ములు. వీరికి కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బంధువులు భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్‌కు మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. కోర్టులో హరికుమార్‌కు అనుకూలంగా భూమికి సంబంధించి తీర్పులు వచ్చాయి. దీంతో భూమి తమకు దక్కదని భావించిన భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్‌లు కక్ష పెంచుకుని మరి కొందరితో కలిసి శనివారం తెల్లవారుజామున బురకాయలకోటకు వెళ్లి నిద్రిస్తున్న అన్నదమ్ములు రామచంద్ర, హరికుమార్, భారతీయుడుపై కర్రలు, ఆయుధాలతో మూకుమ్మడిగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో బాధితులను సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ పరామర్శించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యక్తిపై కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కాలనీగేటులో నివాసం ఉంటున్న బాబు(29) శుక్రవారం రాత్రి అదే ప్రాంతంలోని పుట్టింటిలో ఉన్న భార్య రాణి వద్దకు వెళుతుండగా, స్థానికుడైన గోవిందు, బాబును అడ్డగించి వ్యక్తిగత కక్షతో కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఐజేయూలో ఇరువురికి చోటు

ఐజేయూలో ఇరువురికి చోటు

ఐజేయూలో ఇరువురికి చోటు