
రిషికొండపై ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం
కడప కార్పొరేషన్ : విశాఖపట్నంలోని రిషికొండపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని వైఎస్సార్‌సీపీ వైద్య విభా గం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషికొండపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ నిర్మించారని, ఆ భవనాల నైపుణ్యంపై చంద్రబాబే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. తాజాగా ఆ భవనాల్లో సేనానితో సేన ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకొని ఆ హాల్‌లో ఒక ఫాల్ సీలింగ్ ఊడిపడిన దాన్ని పట్టుకొని విష ప్రచారానికి తెరతీశారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుందే తప్పా వాటర్ లీకేజీ వల్ల పాడై పడినట్లు లేదన్నారు. ఈ భవనాలు కట్టడం వల్ల రూ.400 కోట్లు వృథా అయ్యాయని చూపించబోయి బొక్కబోర్లా పడ్డారన్నారు. ఈ భవ నాలపై రూ.750 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలాగా వృథా ఖర్చులు చేయలేదన్నారు. యో గాంధ్ర పేరుతో ఈ ప్రభుత్వం రూ.400కోట్లు ఖర్చు చేసి కాళ్లు లేనివారికి, చిన్నపిల్లలకు, చనిపోయిన వారికి సైతం యోగా చేసినట్లు సర్టిఫికెట్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సుగాలి ప్రీతి వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారే తప్పా వారికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఐదు సెంట్ల స్థలం, తల్లిదండ్రులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌టీయూసీ నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం
జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి