
క్లస్టర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ బదిలీలలో సర్‌ప్లస్‌గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గణితంతోపాటు భాషా పండితుల పోస్టుల్లో క్లస్టర్ టీచర్లుగా నియమితులైన వారికి డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా రెగ్యులర్ స్థానాలను కేటాయించాలని ఎస్.టీ.యు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్ చెన్నకేశవరెడ్డి కోరారు. ఈ విషయమై శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పదవీ విరమణ స్థానాలను, డీఎస్సీ 2025లో చూపించనున్న ఖాళీలలో ఈ క్లస్టర్ టీచర్లకు రెగ్యులర్ స్థానాలను కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్‌టీయూ నాయకులు హబీబుల్లా, మహబూబ్ బాషా, కడప నగర అధ్యక్షుడు సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.